ప్రజలు వీరికి ఓట్ వేసారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. గంటలు తగ్గే కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది. బయటకు మీమే గెలుస్తున్నామని చెపుతున్నప్పటికీ లో లోపల మాత్రం భయం భయంగానే ఉంది. ఇక చిత్ర సీమా లో స్టార్స్ గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి నటులు..ఈ ఎన్నికల్లో ప్రజల మనసులను గెలుచుకున్నారా లేదా అనేది చూడాలి.

ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే జనసేన పార్టీ పెట్టి గత ఎన్నికల్లో బీజీపీ , టీడీపీ పార్టీలకు మద్దతు ఇచ్చిన పవన్..ఈసారి ఎన్నికల బరిలో నిల్చున్నారు. గాజువాక , భీమవరం స్థానాల నుండి పోటీ చేసాడు. ఈ ఎన్నికల్లో గెలుపు అనేది జనసేనానికి చాలా కీలకం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పవన్ ఓడిపోయిన ఆ ఎఫెక్ట్ జనసేన పార్టీపై ఖచ్చితంగా ఉంటుంది. మరి పవన్ ను ప్రజలు కోరుకున్నారా లేదా అనేది చూడాలి.

అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా నర్సాపురం నుంచి మొదటిసారి ఎంపీగా పోటీ చేసారు. చివరి నిమిషంలో జనసేన తీర్థం పుచ్చుకొని ఎంపీ స్థానానికి పోటీ చేసాడు. మరి ఆయన్ను ప్రజలు ఎన్నుకున్నారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే..గత ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్న ఈయన..ఈసారి కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేసాడు. ఒకవేళ ఈయన ఈసారి కూడా గెలిస్తే..టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి ఆయె ఛాన్స్ ఉంది. మరి ప్రజలు బాలయ్య ను మరోసారి ఎనుకున్నారో లేదో..

ఇక రోజా విషయానికొస్తే..గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినా విజయం దక్కలేదు. ఇపుడు అదే ‘నగరి’ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో రోజా గెలిచి..వైసీపీ అధికారంలోకి వస్తే..రోజాకు జగన్ మంత్రివర్గంలో కీలక మంత్రి పదవి ఇవ్వడం ఖాయం..మరి రోజా జాతకం ఎలా ఉందొ..