ఈ వారం పైనే అందరి చూపు..

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గత మూడు వారాలుగా కళ తప్పింది. ప్రతి వారం రెండేసి, మూడేసి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. మహానటి తరవాత ఆ రేంజ్ హిట్ రాలేదనే చెప్పాలి. దీంతో సినీ ప్రేక్షకులంతా ఓ సరైన సినిమా వస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నారు. గత వారం తేజ్ , పంతం చిత్రాలు మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటి , ఈ రెండు చిత్రాలు ఆకట్టుకోవడం లో విఫలం అయ్యాయి. ప్రస్తుతం పంతం సినిమాకు మంచి కలెక్షన్లే వస్తున్నప్పటికీ , తేజ్ మాత్రం దారుణమైన కలెక్షన్లే కాదు చాల చోట్ల థియేటర్స్ నుండి బయటకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యం లో ఈవారం విడుదలై చిత్రాల పైనే అందరి చూపు పడింది. మెగా ఫ్యామిలీ నుంచి పరిచయమవుతున్న కళ్యాణ్ దేవ్ విజేత గా రాబోతున్నాడు. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత జులై 12న రాబోతుంది. ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం తో ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అందరూ వ్యక్తం చేస్తున్నారు.

ఇక అదే రోజు వస్తున్న మరో స్ట్రెయిట్ చిత్రం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన అరెక్స్ 100. వింటేజ్ బైక్ గా యూత్ మనసులో మిగిలిపోయి ఇప్పుడు వాడుకలో లేని మోడల్ ని పేరుగా పెట్టుకుని టైటిల్ తో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ టార్గెట్ చేసిన యూత్ కి బాగా రీచ్ అయిపోయింది. దానికి తోడు విడుదల చేసిన రెండు ట్రైలర్స్ లోనూ లవ్ రొమాన్స్ తో పాటు కావాల్సినంత యాక్షన్ మసాలా ఉందనేలా చూపడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొనింది.

జులై 13 న డబ్బింగ్ మూవీ చినబాబు వస్తుంది. హీరో కార్తీ ఈ సినిమాలో హీరోగా నటించడం తో ఈ మూవీ ఫై కూడా భారీ కాదుకానీ ఓ మోస్తరు అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. పల్లెటూరి నేపధ్యంలో ఊర తమిళ బ్యాక్ డ్రాప్ తీసిన ఈ మూవీ మనవాళ్లకు ఎంత వరకు నచ్చుతుందో చూడాలి. మొత్తం మీద ఈ వారం ఈ మూడు సినిమాల ఫై ప్రేక్షకులు మంచి ఆసక్తే పెట్టుకున్నారు. మరో ఈ మూడు చిత్రాల్లో ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి.