సమ్మర్ అంత మహర్షి దేనా..?

సంక్రాంతి , దసరా సీజన్ల తర్వాత సినీ ప్రేక్షకులు కోరుకునే సమ్మరే..మండు ఎండలో మంచి సినిమా చూడాలని అంత అనుకుంటారు. అందుకే బడా చిత్రాలన్నీ కూడా సమ్మర్ లోనే క్యూ కడతాయి. కానీ ఈ సమ్మర్ మాత్రం చాల డల్ గా ఉందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. మజిలీ చిత్రం కాస్త పరవాలేదు అనిపించింది కానీ టికెట్స్ కోసం కొట్టుకునే స్థాయి రాలేదు.

ఆ తర్వాత వచ్చిన జెర్సీ , చిత్రలహరి చిత్రాలు ఎక్కువగా ఏ క్లాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. కాంచన బి , సి సెంటర్లలో కుమ్మేసింది. ప్రస్తుతం ఈ నాల్గు చిత్రాలే రన్ అవుతున్నాయి. ఇక అసలైన సమ్మర్ మహర్షి తోనే మొదలు కాబోతుందని అభిమానులు అంటున్నారు.

వంశీ పైడిపల్లి-మహేష్ కాంబినేషన్ కావడం ఆ సినిమా ఓపెనింగ్స్ పలు రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీక్ కలెక్షన్లు కుమ్మేస్తాయని ధీమాగా ఉన్నారు. ఆ తరువాత అన్నది సినిమా ఫలితం మీద ఆధారపడి వుంటుంది. అయితే మిడ్ సమ్మర్ అయిన మే సెకండ్ వీక్ దాటాక కూడా సరైన సినిమాలు లేవు. ఎబిసిడి, వజ్ర కవచధర గోవింద, లాంటి చిన్న సినిమాలు, సీత, అర్జున్ సురవరం, శర్వానంద్ దళపతి వంటి మిడ్ రేంజ్ సినిమాలు మాత్రమే వున్నాయి.

యూత్ ఎదురు చూస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా జూలై చివరకు వెళ్లిపోయింది. సో సమ్మర్ మహర్షి దే..మరి ఇంత మంచి అవకాశాన్ని మహేష్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.