దసరా కు దారేది..?

దసరాకు ఎంచక్కా సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతామని అనుకున్న వారికీ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. తమ డిమాండ్లు నేరవేర్చే వరకు బస్సులు నడపమని అర్ధర్రాతి నుండి సమ్మెకు దిగారు. దీంతో ప్రయాణికుల కష్టాలు మాములుగా లేవు. ఇదే అదును చేసుకొని ప్రవైట్ వాహనదారులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేయడం మొదలుపెట్టారు.

టిక్కెట్ ధరలను మూడురెట్లు పెంచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. సమ్మె సైరన్‌ మోగడంతో అడ్డగోలు దోపిడికి తెరలేపాయి. సమ్మెను క్యాష్‌ చేసుకుంటున్నాయి‌. ప్రయాణికులకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవటంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది తర్వాత వెళ్లొచ్చు అని మళ్లీ ఇంటి దారి పడుతున్నారు.

మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద దసరాకు దారేది అని అంత మాట్లాడుకుంటున్నారు.