యూఎస్ టాప్ 10 తెలుగు చిత్రాల వసూళ్లు..

బాహుబలి ముందు వరకు కూడా పెద్దగా యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన తెలుగు సినిమాల హావ లేదు..కానీ బాహుబలి తర్వాత మన తెలుగు సినిమాల హావ ఒక్కరిగా పెరిగిపోయింది. మన సినిమాలు వస్తున్నాయంటే మిగతా భాషల చిత్రాలు సైతం విడుదల చేయాలా వద్ద అనే ఆలోచనలో పడేంతగా యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన సినిమాల జోరు నడుస్తుంది.

చిన్న , పెద్ద , అగ్ర హీరో , చిన్న హీరో అనే తేడాలేకుండా కథ బాగుండాలే కానీ అక్కడి ప్రేక్షకులు వసూళ్ల సునామి నెలకొల్పుతున్నారు. ఇటీవల కూడా చాలామంది యూఎస్ ప్రేక్షకుల అనుగుణంగా కథలు రాసుకుంటున్నారంటే అర్ధం చేసుకోవాలి..అక్కడ ఏ రేంజ్ లో మన సినిమాలు ఆడుతున్నాయో. ఇటీవల విడుదలైన గీత గోవిందమే దానికి ఉదాహరణ. ప్రస్తుతం ఈ మూవీ రెండు మిలియన్ల జాబితాలో చేరి టాప్ 10 తెలుగు సినిమాల్లో 9 స్థానం లో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలో వసూళ్లలో టాప్ టెన్ ప్లేసుల్లో ఉన్న సినిమాల లిస్ట్ ఓ సారి చూస్తే..

10) ఫిదా -2.07 మిలియన్ డాలర్లు
9) గీతగోవిందం-2.10 మిలియన్ డాలర్లు
8) ఖైదీ నంబర్ 150 – 2.44 మిలియన్ డాలర్లు
7) అ ఆ -2.49 మిలియన్ డాలర్లు
6) మహానటి -2.58 మిలియన్ డాలర్లు
5) శ్రీమంతుడు -2.89 మిలియన్ డాలర్లు
4) భరత్ అనే నేను -3.44 మిలియన్ డాలర్లు
3) రంగస్థలం -3.51 మిలియన్ డాలర్లు
2) బాహుబలి – 6.99 మిలియన్ డాలర్లు
1) బాహుబలి 2- 11.5 మిలియన్ డాలర్లు(తెలుగు), 20 మిలియన్ డాలర్లు (అన్ని భాషలూ కలిపి)