విశాఖ టెస్ట్ లో వరల్డ్ రికార్డులు


దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం నమోదు చేసింది. 395 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పర్యాటక జట్టు 191 పరుగులకు కుప్పకూలింది. దీంతో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో తొలి టెస్టులో గెలుపొందింది.

కాగా ఈ టెస్ట్ పలు రికార్డులకు వేదికైంది. ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించి ఆ ఫీట్‌ నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సాధిస్తే, భారత్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 350వ టెస్టు వికెట్లను 66వ టెస్టులోనే సాధించి అత్యంత వేగవంతంగా ఆ ఘనతను అందుకున్న జాబితాలో ముత్తయ్య మురళీ ధరన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.