HHVM : హరిహర వీర మల్లు.. అభిమానుల్లో నమ్మకం లేదు.. నిరాశ కూడా లేదు..!

 

HHVM : పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్త మొదట వెలువడినప్పటి నుంచి, అది అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తిని పెంచింది. మొదటి టీజర్ వచ్చినప్పుడు “ఇదే కావాల్సింది” అన్నంతగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కానీ ఆ సినిమానే ఇప్పుడు ఎన్నో మలుపుల తర్వాత ఈ నెల విడుదలకో సిద్ధమవుతోంది.

ఇప్పుడు సినిమాకు దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నా, ఫ్యాన్స్ లో ఉత్సాహం స్పష్టంగా కనిపించడం లేదు. అదే సమయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా కూడా చూడడం లేదు. పవన్ సినిమాలకు డైరెక్టర్ పాత్ర ఎంత ముఖ్యమో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాల సమయంలో చూసాం. అప్పట్లో వేను శ్రీరామ్, సాగర్ చంద్రలపై అభిమానులు మంచి నమ్మకం చూపారు. కానీ ఈసారి ఆ ఎనర్జీ అంతగా కనిపించడం లేదు.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

వాస్తవానికి పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ఉన్నా కూడా, రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాల్లో ఎక్కువగా రీమేక్‌లే చేయడం కొంతమందిని నిరాశపరిచింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలు మంచి హైప్ తెచ్చినా, ‘బ్రో’ వంటి ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉండటంతో సినిమాపై ఆయన ప్రమోషన్ లేకుండానే సినిమా ముందుకు సాగుతోంది.

ఇటీవల విడుదలైన హరిహర వీర మల్లు ట్రైలర్ అంచనాలను పెంచలేకపోయినా, నెగటివ్ టాక్ కూడా రాలేదు. కానీ డైరెక్టర్ జ్యోతికృష్ణ గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూసిన ఫ్యాన్స్ మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. “రూల్స్ రంజన్” వంటి ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్ చేతిలో పవన్ సినిమా ఉండటమే కొంత మందిని కంగారు పెట్టింది.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఇక నిర్మాత ఏఎం రత్నం ప్రమోషన్ బాధ్యత తీసుకున్నా, డైరెక్టర్ నుంచే ప్రేక్షకులు ఎక్కువ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పటికైనా జూలై 24న సినిమా రిలీజ్ అయితే, ఫ్యాన్స్ నిజంగా థియేటర్లకు రావాలంటే డైరెక్టర్ మరింత బిజీగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.

చివరగా, ఈ సినిమా పవన్ అభిమానుల అంచనాలను మించేలా ఆడుతుందా..? డైరెక్టర్ జ్యోతికృష్ణ నిజంగా మెప్పిస్తాడా..? అన్నదానిపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.