Kaantha Teaser : వింటేజ్ లుక్‌లో దుల్కర్ సల్మాన్.. ‘కాంత’ టీజర్‌తో సంచలనం!

Kaantha
Kaantha Teaser : దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1950ల మద్రాస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందింది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఈరోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Also Read :  'సూర్య బి పాజిటివ్' - టీజర్ లాంచ్

స్టార్ హీరోగా ఎదిగిన చంద్రన్(దుల్కర్ సల్మాన్), వెటరన్ రైటర్ అయ్య(సముద్రఖని) మధ్య కథనం ఆసక్తికరంగా నడుస్తుంది. అయ్య మొదట రూపొందించిన హర్రర్ కథను చంద్రన్ తన ఇమేజ్‌కు తగ్గట్టు మార్చేసి, ‘శాంత’ అనే టైటిల్‌ను ‘కాంత’ గా మార్చేస్తాడు. దుల్కర్ సల్మాన్ వింటేజ్ లుక్‌లో, తన కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకోగా.. సముద్రఖని ఒక వెటరన్ ఫిల్మ్ మేకర్ గా ఒదిగిపోయారు. భాగ్యశ్రీ బోర్సే తనదైన ముద్ర వేసింది. ఇక సినిమాలోని సెట్స్, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ అన్నీ 1950ల వాతావరణాన్ని ఆవిష్కరిస్తాయి. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానున్న ‘కాంత’ పై టీజర్ ద్వారా అంచనాలు అమాంతం పెరిగాయి.

Also Read :  భయానికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి వస్తోంది ఒక డార్క్, డేంజరస్ హారర్ థ్రిల్లర్!