OG Collections : బాక్సాఫీస్ లో ‘ఓజీ’ ప్రభంజనం.. ఫస్ట్ డే ₹154 కోట్లు!

Og
OG Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతుంది. ప్రీమియర్ల నుండే అన్ని వర్గాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో, మొదటి రోజు భారీ ఓపెనింగ్ అందుకుంది. ‘ఓజీ’ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 154 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. ఈ విజయంతో ‘ఓజీ’ డే 1లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాల జాబితాలో చేరిపోయింది. విదేశాల్లోనూ ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. కేవలం నార్త్ అమెరికాలోనే 3.7 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టగలిగింది. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుతున్నారు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన ఎలివేషన్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ ని ఇలా చూడాలనుకునే అభిమానులందరూ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో, ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.