మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ స్పీచ్ @ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025

Chiranjeevi gaddar awards
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక ఉగాది సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవికు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం చిరంజీవి తన ప్రసంగంలో అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

తన ప్రసంగంలో చిరంజీవి కళాకారులను గౌరవించే సమాజం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఫిలిం అవార్డ్స్‌ను తిరిగి పునరుద్ధరించడం ద్వారా ప్రభుత్వం సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. సినిమాల ప్రభావం ఎంత గొప్పదో, అవి ఎంతమందికి ఉపాధి కల్పిస్తాయో వివరించారు. అలాగే హైదరాబాద్‌ను భారతీయ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమాకి కేంద్రంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఉందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు.

Also Read :  రైతుల మధ్య వినూత్న ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్న “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా

ఇంకా ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘WAVES’ వంటి కార్యక్రమాల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, భారతీయ సంస్కృతి, సినిమా, క్రీడలు వంటి అంశాలను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అన్నారు. ఇతర దేశాల్లో K-పాప్, అనిమే వంటి రంగాలు ఆర్థికాభివృద్ధికి ఎలా దోహదపడ్డాయో ఉదాహరణగా చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా సినిమాను మరింత ప్రోత్సహించాలని సూచిస్తూ, పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. చివరగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.