Mega 158: మెగా 158 నుంచి హనీ రోజ్ అవుట్.. చిరంజీవి పక్కన క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ!

Mega 158 (2)

Mega 158: మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మెగా 158’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీలో ఒక క్రేజీ అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఒక కీ రోల్ కోసం కన్నడ స్టార్ బ్యూటీ రచితా రామ్‌ను ఎంపిక చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ముందుగా ఈ పాత్ర కోసం మలయాళ నటి హనీ రోజ్‌ను అనుకున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె స్థానంలో రచితా రామ్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

Also Read :  Sandeep Reddy Vanga: బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ జాతర.. థియేటర్‌లో సినిమా చూసి సందీప్ రెడ్డి వంగా సంచలన రియాక్షన్!

ఇటీవలే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘కూలీ’ చిత్రంలో తన నటనతో మెప్పించిన రచితా రామ్.. ఇప్పుడు నేరుగా మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్‌లో లక్కీ ఛాన్స్ కొట్టేయడంపై ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరు – బాబీ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ దీనిపై భారీ హైప్ నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.