
Suriya – SS Rajamouli: సౌత్ స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌పై మరోసారి ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబో ఎట్టకేలకు సెట్ అయ్యిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సూర్యతో సినిమా చేసేందుకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇండియన్ సినీ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మరో భారీ కాంబినేషన్ తెరపైకి రానుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ అంచనాలను సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వాస్తవానికి సూర్య-రాజమౌళి కాంబినేషన్ కొత్త విషయం కాదు. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రంలో హీరోగా మొదట సూర్య పేరును పరిశీలించినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల ఆ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కూడా పలుమార్లు వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించినప్పటికీ అవి కేవలం ప్రచారంగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి సూర్య-రాజమౌళి ప్రాజెక్ట్‌పై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికి వరకు ఈ వార్తలపై చిత్రబృందం లేదా రాజమౌళి, సూర్య నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగా సెట్స్‌పైకి వస్తుందా? లేక మరోసారి రూమర్‌గానే మిగిలిపోతుందా? అనే దానిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.













