HHVM : రన్‌టైమ్‌పై అభిమానుల్లో ఆసక్తి.. కానీ..

HHVM : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్’ చివరకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జూలై 24, 2025న థియేటర్లలో విడుదల కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎ.దయాకర్ రావు నిర్మించగా, ప్రముఖ నిర్మాత ఎం. రత్నం సమర్పిస్తున్నారు.

చిత్రంపై భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో, ఇప్పటికే అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పూర్తి టికెట్ విక్రయాలు జూలై 10, 2025 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మల్టీప్లెక్స్‌లతో పాటు అనేక లొకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈ సినిమా నిడివి పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. యూఎస్ టికెటింగ్ వెబ్‌సైట్లలో చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివితో చూపబడుతోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు బాబీ డొయల్ కనిపించనున్నాడు. అలాగే సత్యరాజ్, నాజర్, వెన్నెల కిశోర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

అలానే, ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నది ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి. ఆయన సంగీతం ఇప్పటికే భారీ అంచనాలు కలిగించింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు చిత్రంపై ఉన్న అంచనాలను పెంచగా, పవన్ కళ్యాణ్ పీరియాడికల్ అవతారాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఈ చిత్రం హైప్‌కు సరిపోయేలా ఉంటుందా లేదా అన్నది జూలై 24న తేలనుంది.