Raju Weds Rambai : ‘రాజు వెడ్స్ రాంబాయి’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు : కిరణ్ అబ్బవరం

Raju weds rambai
Raju Weds Rambai : అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సాయిలు కంపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – మేము షార్ట్ ఫిలింస్ చేసేప్పుడు కొత్త వాళ్లకు ఏదైనా సపోర్ట్ దొరికితే బాగుండేది అనిపించేది. ఇప్పుడా సపోర్ట్ ఈటీవీ వారి రూపంలో యంగ్ టాలెంట్ కు దక్కుతోంది. వంశీ నందిపాటి గారితో ‘క’ మూవీ చేశాను. ఆయన చెబితే ఆ మూవీలో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నట్లే. హీరో అఖిల్ బాగా నటించాడు, తేజస్వినీ మన పొరుగు అమ్మాయి అనేంత సహజంగా ఉంది. ఈ జంటను చూస్తుంటే మన ఊరిలో అరుగుమీద కూర్చుని సరదాగా మాట్లాడుకునే జంటలా అనిపిస్తున్నారు. డైరెక్టర్ సాయిలును చూసినప్పుడు అతనిలో నిజాయితీ కనిపించింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ ట్రైలర్ చూస్తుంటే ప్రతి షాట్ కొత్తగా అనిపించింది. అదే విషయాన్ని సాయిలుకు చెప్పాను. ఊరి కథలు ప్రేక్షకులు చూస్తారా అంటే తప్పకుండా చూస్తారు మనలో 80శాతం మంది ఊరి నుంచి వచ్చినవాళ్లమే. సినిమాలను ఎక్కువగా ఆదరించేది ఊరి వాళ్లే. నేను చాలా దారుణాలు విన్నాను గానీ వీళ్లు వచ్చి సినిమా క్లైమాక్స్ గురించి చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటిది జరిగిందా. మా ఊరు చుట్టుపక్కల ప్రేమ కథల్లో కూడా దారుణాలు జరిగాయి గానీ ఇలాంటివి నిజంగా జరిగిందా, ఇలా చేస్తారా, ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించింది. ఈ సినిమాను మిగతా అందరి కంటే ముందు పదిహేనేళ్లు ప్రేమ కథను దాచిపెట్టిన ఆ ఊరి వాళ్లు ఫస్ట్ చూడాలి. ఈ బాధను మనం పక్కని వాళ్లకు కూడా చెప్పుకోలేకపోయాం. ఈ కథను సినిమాగా చేశారు చూద్దామని ఆ ఊరిలోని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. క్లైమాక్స్ తెలుసుకుని నేను షాక్ అయినట్లే సినిమా చూసిన ఆడియెన్స్ కూడా ఫీల్ అవుతారు. మీకు అందుబాటులో ఉండేలా 99 రూపాయలకే టికెట్ రేట్ పెట్టారు. మీరంతా సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ – ఇది ఊరి కథ అని కొందరు చులకనగా మాట్లాడుతున్నారు. అవును నేను ఊరోడినే. నా ఊరంటే నాకు ప్రేమ, ఆ ఊరిలో ఉండే మనషులు ఇష్టం. అక్కడి కథలతోనే సినిమాలు రూపొందిస్తా. మా సినిమాలో హెలికాప్టర్ షాట్స్, మెట్రో షాట్స్ లేవు. ఊరిలో ఆటోడ్రైవర్, కాలేజ్ కు వెళ్లే అమ్మాయి..వీళ్లే ఉంటారు. మీకు సినిమా నచ్చకుంటే లైట్ తీసుకోండి కానీ నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. సినిమా బాగా లేదనే నెగిటివ్ టాక్ వస్తే అమీర్ పేట చౌరాస్తాలో అర్థనగ్నంగా తిరుగుతా. ఛాలెంజ్ చేస్తున్నా. 15 ఏళ్లు బయటకు రాకుండా సమాధి చేయబడిన ప్రేమ కథ ఇది. ఈ సినిమా కోసం నేనూ మా టీమ్ పగలూ రాత్రీ కష్టపడ్డాం. ఆ బాధతో చెబుతున్నాం నెగిటివ్ ప్రచారం చేయకండి. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీకు మీ ఊరు గుర్తుకొస్తుంది, మీ ఊరిలోని స్నేహితులు, మీ ప్రేమ కథ గుర్తుకు వస్తాయి. అన్నారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ – కిరణ్ అన్న షార్ట్ ఫిలింస్ చూసి ఇన్స్ పైర్ అయ్యేవాడిని. ఆయన ఈ రోజు మా మూవీ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాను ప్రేమించేవారే. సినిమా మీద ప్యాషన్ తో వచ్చినవారే. మేమంతా ఇంత కష్టపడి చేసిన సినిమా మీద కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మా మూవీ క్లైమాక్స్ గురించి మీమ్స్ పెడుతున్నారు. అలాంటి క్లైమాక్స్ మా సినిమాలో ఉండదు. మా డైరెక్టర్ ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారో, ఆయన అలాగే ఉంటారు. ఎవరు ఆపాలని చూసినా మా మూవీ ఆగదు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున పెద్ద సక్సెస్ దక్కుతుందని ఆశిస్తున్నాం. నేను కెరీర్ బిగినింగ్ లో ఉన్నా. మా సినిమా మీదనే ఆధారపడి ఉన్నాం. ఈ సినిమా మీకు నచ్చకుంటే నా నెక్ట్స్ మూవీస్ కూడా చూడకండి. సినిమా మీద నమ్మకంతో ఈ మాట చెబుతున్నా అన్నారు.

హీరోయిన్ తేజస్వినీ మాట్లాడుతూ – ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ మూవీ. ఈ సినిమా హార్ట్ టచింగ్, హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా మీ గుండెల్ని హత్తుకుని ఆలోచింపజేస్తుంది. ఈ మూవీ ఇచ్చే ఎక్సిపీరియన్స్ కోసం ఈ నెల 21న తప్పకుండా థియేటర్స్ కు రావాలని కోరుతున్నా. థియేటర్స్ కు వచ్చాక మా మూవీతో ప్రేమలో పడతారు. ఈ చిత్రంలో రాంబాయి పాత్రలో నేను బాగా పర్ ఫార్మ్ చేశానంటే అందుకు మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ కారణం. అన్నారు.