ఇతర వార్తలు

Other-News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. 2019-2020 బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్‌ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఉద్యోగులకు బుధవారం తీపికబురు అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో 30.67...

సిరాజ్ .. మెరుపుల్

యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ తాజా సీజన్ లో అతి తక్కువ స్కోరు నమోదైంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8...

రొమ్ము క్యాన్సర్ ని ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు – ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత

రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ సునీత పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవాల్లో భాగంగా కొన్ని కీలకాంశాలను ఆమె విశదీకరించారు. మనదేశంలో ఒకప్పుడు క్యాన్సర్ బాధిత మహిళల్లో అత్యధిక శాతం మంది గర్భాశయ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉండేవారని, అయితే 2008 తర్వాత రొమ్ము క్యాన్సర్ ప్రభావం పెరిగినట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయని డాక్టర్ సునీత తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ రొమ్ము క్యాన్సర్ తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ప్రధమ స్థానంలో ఉందని, ప్రస్తుతం మొత్తం క్యాన్సర్ బాధిత మహిళల్లో 30 శాతం మంది రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుండగా, దాదాపు 10 శాతం మంది గర్భాశయ క్యాన్సర్ తో పోరాడుతున్నారని తెలిపారు. వయసు మళ్లిన వారే కాకుండా, యుక్తవయస్సు మహిళలు సైతం రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారినపడటం ప్రమాదకర పరిణామమని చెప్పారు.30-40 ఏళ్ల మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారని, మొత్తం క్యాన్సర్ పేషేంట్లలో దాదాపు సగం మంది యాభై ఏళ్ల లోపు వయసు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి కోలుకున్న వారి సంఖ్య అమెరికాలో 95 శాతం ఉండగా, మనదేశంలో 60 శాతం మంది మాత్రమే వ్యాధి నుండి కోలుకోగలుగుతున్నారని, వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రొమ్ములో నొప్పి లేకుండా చిన్న చిన్న గడ్డలు ఏర్పడటం రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక లక్షణమని, ఈ గడ్డ క్రమక్రమంగా పెరుగుతుండటం, చంకలో నొప్పిగా ఉండటం, చర్మం రంగు మారడం తదితర లక్షణాలను రొమ్ము క్యాన్సర్ గా అనుమానించాల్సివుంటుందని అన్నారు. క్యాన్సర్ గడ్డలను గుర్తించేందుకు ఎవరికి వారు రొమ్ములను స్వయంగా పరీక్షించుకునేలా యుక్తవయస్సు నుండే అలవాటు చేసుకోవాలని డాక్టర్ సునీత సూచించారు. రొమ్ము క్యాన్సర్ గురించి ఆడపిల్లలకు సమగ్రమైన అవగాహన కల్పించాలని, ప్రతినెలా క్రమంతప్పకుండా ఋతుస్రావం ముగిసేరోజున స్నానం చేసే సమయంలో రొమ్ములను పరీక్షించుకునేలా యుక్తవయస్సులోకి అడుగిడగానే ఆడపిల్లలకు అలవాటు చేసి, ఆ అలవాటును జీవితాంతం కొనసాగించేలా చూడాలని వివరించారు. స్వీయ పరీక్ష ద్వారా రొమ్ములో ఏవైనా గడ్డలు ఏర్పడితే వెంటనే గుర్తించి డాక్టర్ ను సంప్రదించేందుకు అవకాశం లభిస్తుందని, రొమ్ములో ఏర్పడే అన్ని గడ్డలు క్యాన్సర్ వల్ల వచ్చినవి కాకపోయినప్పటికీ, ఎప్పటికప్పుడు పరీక్షించి జాగ్రత్తగా ఉండటం మంచిదని పేర్కొన్నారు. చాలా మంది తమంతట తాముగా మామ్మోగ్రామ్ పరీక్ష చేయించుకుంటున్నారని, దీనివల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు కొన్ని కేసుల్లో మామ్మోగ్రామ్ పరీక్ష ద్వారా క్యాన్సర్ నిర్ధారణ క్లిష్టంగా ఉంటుందని, అటువంటి కేసుల్లో బ్రెస్ట్ ఎంఆర్ఐ పరీక్ష నిర్వహించేలా నిపుణులు సూచిస్తారని తెలిపారు.45 ఏళ్లు దాటిన స్త్రీలు కచ్చితంగా రెండేళ్లకోసారి మామ్మోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలని, రొమ్ములో ఏదైనా అసహజమైన మార్పులను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సూచనలను పాటిస్తే రొమ్ము క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి క్యాన్సర్ బాధిత మహిళల ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. రొమ్ము క్యాన్సర్ పై ఆడబిడ్డలు అవగాహన పెంపొందించుకుని, ఎవరికి వారు స్వయంగా పరీక్షించుకునేలా చైతన్యవంతులను చేయడం, మన మాతృమూర్తులకు మామ్మోగ్రామ్ పరీక్షలు చేయించడం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని డాక్టర్ సునీత అన్నారు. 

ధోని ఫ్యాన్స్.. అప్సెట్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈసారి  షాక్ తాగింది. సీజన్‌ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్‌ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్‌ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. నిన్నటి  మ్యాచ్‌లో...

అబిడ్స్ చర్మాస్ లో భారీ అగ్ని ప్రమాదం…

హైదరాబాద్ ఈ పేరు వింటేనే అంత హడల్ అవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షలకు హైదరాబాద్ అసలు రంగు బయటపడింది. మొన్నటి వరకు హైదరాబాద్ ను అంత సేఫ్ అన్న ప్రజలు..ఇప్పుడు హైదరాబాద్...

నిండుకుండలా మారిన పులిచింతల ప్రాజెక్టు

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 47వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం 3 గేట్లు ఎత్తి 63 వేల 700...

ఒక్క ఊరపిచ్చుక కోసం 45 రోజులుగా కరెంటుకు దూరంగా… గ్రామస్తులపై ప్రశంసల జల్లు

ఒకప్పుడు  ఊర పిచ్చుకలు  ఇళ్ల  మధ్యనే జీవనం సాగించేవి. పల్లెల్లో బయటకొస్తే వందల్లో కనిపించేవి. ఎప్పుడైతే సాగులో పురుగు మందుల వాడకం మొదలైందో అప్పట్నుంచి ఊర పిచ్చుకల  పతనం ప్రారంభమైంది. పురుగు మందుల...

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఇద్దరు అమెరికన్‌ సైంటిస్టులు, ఒక బ్రిటీష్‌ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్‌ ఎం.రైజ్‌, బ్రిటీష్‌కు చెందిన హైకేల్‌ హోటాన్‌లను...

కేకేఆర్‌ ని మట్టి కరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ పరుగుల మోతకు వేదికయ్యింది.   ఈ ఉత్కంఠ భరితమైన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో...

టాప్ లో కోహ్లీసేన

విరాట్‌ కోహ్లీ (72 ) కళాత్మక ఇన్నింగ్స్‌కు దేవదత్ పడిక్కల్‌ (63  దూకుడు తోడవ్వడంతో బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది.  ఈ రోజు మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో...

Latest News