బిగ్ బాస్ నుండి అమిత్ అవుట్..

బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో పూర్తి కాబోతుంది. దీంతో బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరో అవుతారో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉండ‌గా, వీరిలో ఈరోజు ఇంటిని వదిలి పెట్టి ఎవరు బయటకు వెళ్తారనేది అందరిలో టెన్షన్ మొదలు అయ్యింది. అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎవరిని ఇంట్లో ఉంచాలో..ఎవర్ని బయటకు పంపాలో నిర్ణయించాలసింది ప్రేక్షకులకే వదిలిసిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా తమ తమ అభిమాన సభ్యుడికి తమ ఓట్లు వేసి ఇంట్లో ఉండేలా చేస్తున్నారు. ఇక ఈ వారం మాత్రం అమిత్ కు తక్కువ ఓట్లు రావడం తో ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్ళింది అమిత్ అని తెలుస్తుంది.

ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో అమిత్‌, రోల్ రైడా, కౌశ‌ల్‌, దీప్తి, గీతా మాధురిలు ఉన్నారు. దీప్తి, గీతా మాధురి, కౌశల్ లకు భారీ ఓటింగ్స్ వచ్చాయి. ఇక మిగిలిన ఇద్ద‌రు స‌భ్యులు అమిత్‌, రోల్ రైడాల‌కి ఓటింగ్ స‌ర‌ళి ప్ర‌కారం త‌క్కువ ఓట్లు వ‌చ్చాయని, ఇందులో అమిత్‌కి అంద‌రిక‌న్నా త‌క్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యేది అమిత్ అని ఖరారు అయ్యింది.