డ్రీమ్ లైనర్ విమాన సేవలు నిలిపివేత

Air Indiaఎయిరిండియా ఆరు డ్రీమ్ లైనర్ (బోయింగ్ 787) విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఈరోజు (గురువారం) ప్రకటించింది. ఫౌరవిమానయానశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. బోయింగ్ 787లో సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా అమెరికా, జపాన్ లు ఇప్పటికే ఈ సేవలను నిలిపివేశాయి. మరోపక్క బుధవారం జపాన్ లో చోటుచేసుకున్న ఘటనపై యూఎన్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ విచారణ చేపట్టింది. ఎక్కువ దూరం ఎగరడమేకాకుండా తక్కువ ఇంధనాన్ని వినియోగించుకునే సామర్థ్యం డ్రీమ్ లైనర్ కు ఉంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.