నిర్భయ దోషులకి ఉరిపై బిగ్ ట్విస్ట్ 

నిర్భయ దోషులని ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. రేపు ఉదయం 6గంటలకి నిర్భయ దోషులని ఉరితీయడం ఖాయం అనుకొన్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం వినిపించిన మాటలవి. కానీ ఓ గంటల్లో పరిస్థితి మారింది. మధ్యాహ్నం తీర్పునిచ్చిన అదే కోర్టు.. రేపటి నిర్భయ దోషుల ఉరిపై స్టే ఇవ్వడం విశేషం.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చత్తీస్‌ఘడ్‌ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాతే పవన్ గుప్తా మెర్సీ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో నిర్భయ దోషులడెత్‌వారెంట్లపై కోర్టు స్టే విధించింది.  నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి.

గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉరి తీయలంటూ పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. అది కాస్త మార్చి 3కి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి నిర్భయ ఉరి అమలు వాయిదా పడింది. చూస్తుంటే.. ఈలోకంలో నిర్భయ దోషులకి నూకలు ఇంకా బాకీ ఉన్నట్టు ఉన్నాయి.