మరోసారి డీజీల్ ధరల వడ్డన?

dieselడీజీల్ రేట్లు పెంచేందుకు రంగం సిద్ధమైంది. చమురు సంస్థలతో కేంద్ర ఇంధన శాఖ అధికారులు ఈరోజు (గురువారం) చర్చించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో చమురు సంస్థల అధికారులు లీటర్ డీజిల్ పై ప్రస్తుతం రూ. 10 నష్టం వస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయని తెలిసింది. అయితే నష్టాన్ని పూడ్చుకునేందుకు డీజిల్ ధరలు పెంచుకోవచ్చని కేంద్రం అనుమతిని ఇచ్చిందని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో డీజీల్ రేట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా, చమురు సంస్థల అధికారులు మాత్రం గురువారం అర్థ రాత్రి నుంచే డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పినట్లు సమాచారం.