ఫేస్ బుక్ గ్రాఫ్ సర్చ్ ప్రారంభం

Facebook chief executive Mark Zuckerberg announces the limited beta release of Graph Searchసామాజిక నెట్ వర్క్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ఇప్పుడు సరికొత్త సర్చ్ సదుపాయాన్ని నెటిజన్ల ముందుకు తీసుకొచ్చింది. ప్రాంతాలు, వ్యక్తులు, ఇతర సమాచారం గురించి ఒకేసారి వెతికే ఈ సదుపాయాన్ని కంపెనీ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ కాలిఫోర్నియాలో ఆవిష్కరించారు. గ్రాఫ్ సర్చ్ పేరుతో బీటా వర్షన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫేస్ బుక్ సైట్ లో ప్రతి వెబ్ పేజీలో టాప్ లో కనిపించే ఈ టూల్ తో వ్యక్తులు, ఫొటోలు, ప్రదేశాలతో పాటు ఇతర సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. ఈ కొత్త సదుపాయం ఫేస్ బుక్ వైపు మరింత మందిని ఆకర్షిస్తుందన్న నమ్మకాన్ని కంపెనీ ప్రతినిధులు వ్యక్తం చేశారు.