‘తనిష్క్’ దొంగ దొరికాడు!

TANISHQతనిష్క్ జువెలర్స్ లో దొంగతనానికి పాల్పడిన దొంగ దొరికాడు. షోరూం వెనక గోడ పగలగొట్టి రూ.23 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించిన విషయం తెలిసిందే. దొంగ తన గురించి తానే పోలీసులకు సమాచారమివ్వడం విశేషం. పైగా సంచలనం కోసమే దొంగతనానికి పాల్పడినట్లు దొంగ పేర్కొనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ దొంగెవరంటారా.. ? పేరు కిరణ్ కుమార్. గుంటూరు జిల్లా వాసి. దేశ పరిస్థితులే తనను దొంగగా మార్చాయని కిరణ్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.