150 సంవత్సరాల తరువాత మళ్లీ అరుదైన చంద్రగ్రహణం…!

ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం ఈరోజు ఏర్పడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. పాక్షిక చంద్రగ్రహణం 150 ఏళ్ల తర్వాత మళ్లీ గురు పూర్ణిమ రోజున రావడం విశేషం. మేష, కర్కాటక, వృశ్చిక, సింహ, మీన రాశుల వారికి విశేష ఫలం ఈ గ్రహణం ద్వారా లభిస్తుందని జ్యోతిషులు వివరిస్తున్నారు.

గ్రహణం నేటి రాత్రి ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో అంటే అర్ధరాత్రి 1.30 గంటలకు ధనస్సు రాశిలో ప్రారంభమై, అదే నక్షత్రం రెండో పాదంలో, తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశిలో ముగుస్తుంది. మొత్తం 178 నిమిషాల పాటు ఉండే గ్రహణం ఇండియాలో పాక్షికంగానే కనిపిస్తుంది. ఇక ఈ గ్రహణాన్ని పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టినవారు, ధనుస్సు, మకర రాశులకు చెందిన వారు చూడవద్దని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అయితే, గ్రహణం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉండటంతో, ఆ సమయంలో అత్యధికులు నిద్రలో ఉంటారు కాబట్టి, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.