ఛాంపియన్‌ ట్రోఫీ భారత జట్టు వివరాలు..

జూన్ 1 నుండి ప్రారంభ‌మ‌య్యే చాంపియ‌న్స్ ట్రోఫీకి భారత జట్టు ను ఎంపిక చేసింది సెల‌క్ష‌న్ క‌మిటీ. ఐపీఎల్‌లో రాణించిన ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌ తో పాటు పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మి కూడా తిరిగొచ్చాడు.. ఈ టోర్నీకి భార‌త్ డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. 2013లో చివ‌రిసారి జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో ఇంగ్లండ్‌పై గెలిచి ట్రోఫీ గెలిచింది టీమిండియా. ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ జూన్‌ 4న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది.

ఇక టీం సభ్యుల వివరాల్లోకి వస్తే..

విరాట్ కోహ్లి, శిఖ‌ర్ ధావ‌న్‌, రోహిత్ శ‌ర్మ‌, అజింక్య ర‌హానే, ఎమ్మెస్ ధోనీ, యువ‌రాజ్ సింగ్‌, కేదార్ జాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, అశ్విన్‌, జ‌డేజా, ష‌మి, ఉమేష్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, మ‌నీష్ పాండే. జస్‌ప్రీత్ బుమ్రా.