ఆసక్తికరంగా.. ఆక్లాండ్ టెస్ట్!!

india-vs-newziland-1st-testఆక్లాండ్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. మొదటి ఇన్నింగ్స్ లో 503 పరుగుల భారీ స్కోర్ సాధించిన కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. భారత్ ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచింది. కాగా, టీం-ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 407 పరుగుల విజయ లక్ష్యంగో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం-ఇండియా మూడోరోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. ధావన్ 49, పుజారా 22 క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే మరో 320 పరుగులు చేయాలి. 9వికెట్లు చేతిలో వున్నాయి. మరో రెండు రోజుల ఆట మిగిలి వుండటంతో.. గెలుపు పట్ల రెండు జట్లకు సమాన అవకాశాలున్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.