కనువిందుకు సిద్ధమవుతున్న కింగ్ ఫిషర్ క్యాలండర్

Siddarth Malya with Kingfisher Calendar 2013 Modelsకింగ్ ఫిషర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అందాలు స్వేచ్చగా ఆరబోసే బికినీ భామలతో సర్వాంగ సుందరంగా దశాబ్దకాలంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తున్న కేలండర్. ప్రతి ఏటా బికినీ భామల కేలండర్ రూపొందించడం విలాసాలకు ప్రతిరూపంగా పేరుతెచ్చుకున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ప్రత్యేకత.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్యాలండర్ తయారు చేయడం ఆయన హాబీ. ఆ భామలతో భుజాలు భుజాలు కలిపి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ఆయనకు మహా సరదా. ఈ విషయంలో విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ మాల్యా తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. యధారాజా తధా ప్రజా అన్నరీతిలో తండ్రి విలాసాలు తనయునికి బాగా అబ్బాయి.

Siddarth Malya with Kingfisher Calendar 2013 Models 12013వ సంవత్సరానికిగాను కింగ్ ఫిషర్ కేలండర్ అందాల భామలను సిద్దార్థ మాల్యా ఎంపిక చేశారు. 2003నుండి ఈ క్యాలెండర్ ను విజయ్ మాల్యా యాజమాన్యంలోని యునైటెడ్ బ్రూబరీస్ గ్రూప్ ప్రచురిస్తోంది. దాదాపు రెండు వందల మంది నుంచి వివిధ పరీక్షల ద్వారా 12మందిని ఎంపిక చేస్తారు. ఇందుకోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తారు.

kingfisher-calendar-girls-2013-hot-bikini-photoమోడలింగ్, సినిమా రంగాలలోకి వెళ్లాలనుకునేవారికి కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు చాలా తేలికగా మోడలింగ్, చిత్రపరిశ్రమలో అడుగుపెట్టగలరు. వారిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. సినీ, దర్శక, నిర్మాతలు కూడా ఈ కేలండర్ కు ఎంపికయ్యేవారి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తారు. కత్రినా కైఫ్, దీపికా, యానగుప్తా, ఉజ్వల రౌత్, నర్గీస్ ఫాఖ్రి, లిసాహేడెన్, ఏంజెలా జాన్సన్ వంటి మోడల్స్, బాలీవుడ్ నటీమణులు ఈ క్యాలెండర్ ఎక్కిన వారే. ఈ భామల శరీరారకతులను వివిధ భంగిమలలో తమతమ కెమెరాలో బంధించడానికి పోటీపడతారు. వారి నైపుణ్యాన్ని క్రియేటివిటీని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వారికి ఇది ఒక వేదిక. తాజాగా 2013 కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం కూడా అందమైన అమ్మాయిలు సిద్దమయ్యారు.

Kingfisher-Calendar-2013-Models2013కు గాను ముందుగా 500 మంది సుందరాంగులను ఎంపిక చేసి వారి నుండి 50 మందిని సెలెక్ట్ చేశారట. ఆ 50 మందికి వివిధరకాలుగా పరీక్షించి ఫైనల్ గా 12 మందిని సెలెక్ట్ చేశారు. అంతా బాగానే ఉంది. ఇటీవలి కాలంలో భారీ నష్టాలలో కూరుకుపోయినా కూడా కింగ్ ఫిషర్ అధినేతలు క్యాలెండర్ కోసం కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడమే అందరికీ ఓ అంతుపట్టని విషయంగా చర్చనీయాంశమవుతోంది. అయినా, ఈ క్యాలెండర్ వల్ల కనీసం ఓ 12 మందికి బ్రహ్మాండమైన భవిష్యత్తు అందిస్తున్నారన్న విషయం మాత్రం ఒప్పుకుని తీరవలసిందే! అందుకే అన్నీ మరిచి మాల్యాలు అందిస్తున్న అందాలను ఆస్వాదిద్దాం!!!