పైలట్ కావాలని దొంగయ్యాడు !

tanishqహైదరాబాద్ లో కలకలం సృష్టించిన తనిష్క్ జ్యూయలరీ చోరీ కేసు మిస్టరీ వీడింది. చోరీ చేసింది కిరణ్ అనే యువకుడని సీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు వికలాంగుడిగా నటించాడని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్ ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీసీ పుటేజ్ లో ఉన్న మరోవ్యక్తి కిరణ్ రూమ్ మేట్ గా తేలిందన్నారు. అతని పేరు ఆనంద్ అని కిరణ్ తెలిపాడన్నారు. ఈ ఘటనలో రూ. 23 కోట్ల విలువైన 30 కిలోల బంగారం చోరీకి గురయిందన్న యాజమాని ఫిర్యాదుతో దర్యాప్తు ఆరంభించామన్నారు. పైలట్ కావాలని భావించిన కిరణ్ అందుకు 15లక్షలు, తన తమ్ముడు ఆనంద్‌కు సోకిన పోలియో వైద్య చికిత్స కోసం 5 లక్షలు ఖర్చు అవుతాయని భావించాడు. ఆ డబ్బుల కోసమే దొంగతనానికి సిద్ధపడ్డారని తెలియజేశారు. మీడియా ద్వారా వస్తున్న కథనాలు, పోలీసుల గాలింపు ఎక్కువైందని గమనించిన దొంగలు తమ దగ్గరున్న బంగారాన్ని ఎలా క్యాష్ చెయ్యాలో తెలియక టీవీ ఛానెల్ ద్వారా లొంగిపోయినట్లు వెల్లడించారు.

1ప్రస్తుతం 5.98 కోట్ల విలువైన 15.97 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, నగల దుకాణం యజమాని చెప్పినట్లు చోరీ గురయిన ఆభరణాల విలువ రూ.23 కోట్లు ఉండదన్నారు. చోరీకి పాల్పడిన విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.

దొంగతనం చేసిన కిరణ్ పోలీసులకు లొంగిపోయే ముందు ఒక ప్రైవేటు వార్తా చానల్ తో మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘ముందుగా మీడియాకి చెబితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, అదే పోలీసుల వద్దకెళ్తే నా లొంగుబాటుని కూడా వాళ్ల క్రెడిట్‌లో వేసుకుంటారు అ చానల్ తెలిపాడు. కాగా, కిరణ్ మానసిక పరిస్థితి పై పలు అనుమానాలున్నాయి. ప్రస్తుతం కిరణ్ మానసిక స్థితిని పరిశీలిస్తున్నారు.