కోల్ కతా వస్ర్త గోదాంలో భారీ అగ్నిప్రమాదం

kolkata-FIREకోల్ కతాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుర్రాబజార్ లోని ఓ వస్త్ర గోదాం లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ౨౪ ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిల్వ ఉంచిన వస్త్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు