ఇల్లు పేల్చేద్దామని వచ్చాను..

delhi-gang-repeఢిల్లీ ఘటన తాలూకు పర్యవసానాలు పోలీసులను ఇంకా వదలడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ ఇంటిని పేల్చేయాలని నిన్న కొందరు వ్యక్తులు ప్రయత్నించగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం అనుమానాస్పందగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తుల్ని స్థానికులు ప్రశ్నించగా రాంసింగ్ ఇంటిని పేల్చేయడానికి వచ్చాయని చెప్పారు. దాంతో స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు తప్పించుకున్నారు. ఒకరు దొరికారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర రెండు నాటుబాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.