అంతరిక్షంలో అద్భుతం

earth-really-close-to-sunఅంతరిక్షంలో బుధవారం ఓ వింతగొలిపే అబ్బురం చోటుచేసుకుంది. సూర్యుడికి అత్యంత సమీపంగా ఉండే ప్రాంతంలోకి భూగోళం వెళ్లింది. బుధవారం ఉదయం 10గంటల 10 నిమిషాలకు ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీరఘునందన్‌ సూర్యుడికి దగ్గరగా భూమి వెళ్ళిన ఆ సమయంలో సూర్యుడికి 147మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నామని తెలిపారు. అయితే సూర్యుడికి దగ్గరగా భూమి వెళ్ళినా భూ ఉష్ణోగ్రల్లో మాత్రం ఎటువంటి మార్పు వుండదు. ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి అక్షంలో ఒరుగుదలే ఇందుకు కారణమని తెలిపారు. మన రుతువులన్నీ ఈ ఒరుగుదల వల్లే ఏర్పడుతాయే తప్ప సూర్యుడికి ఎంత దగ్గరగా భూమి వెళ్లిందన్న దానిపై ఆధారపడి ఉండదని ఆయన వెల్లడించారు. ప్రతీ సంవత్సరం జనవరి మాసంలో భూమి తన కక్ష్యలో సూర్యుడికి సమీపంలో ఉండే బిందువులోకి వస్తుంది. ఈ బిందువునే ఖగోళశాస్త్రంలో పరిహేళి అని వ్యవహరిస్తారు. అలాగే జులై మాసంలో సూర్యుడికి దూరంగా ఉండే బిందువులోకి వెళుతోంది. ఈ బిందువునే ఖగోళశాస్త్రంలో అపహేళి అని వ్యవహరిస్తారు. ఈ ఏడాది జులై 5న అపహేళి సంభవించనుంది. సౌరకుటుంబంలోని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలకు ధీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్ర మించడం వల్లనే ఇవి సూర్యుడికి దగ్గరగా, దూరంగా వెళ్లే సందర్భాలు వస్తుంటాయి అని ప్లానిటరీ సొసైటీ ఆప్‌ ఇండియా పేర్కొంది.