కమలానందకు నో బెయిల్?

No-bail-for-Kamalanandaస్వామి కమలానంద భారతిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో కమలానంద తన ప్రసంగంలో ముస్లింలను బాధించేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కమలానంద భారతి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమలానంద భారతిని చంచల్ గూడ జైలులో ఉంచారు.

మరోవైపు ఈ కేసులో బెయిల్ కోసం కమలానంద భారతి తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసును ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులాగానే పోలీసులు వ్యవహరించక తప్పడం లేదు. అక్బరుద్దీన్ పై రిజిస్టర్ చేసినట్టే స్వామి కమలానందపై కూడా నాన్ బెయిలబుల్ కేసును రిజిస్టర్ చేశారు పోలీసులు. అలాగే ఈ కేసులో కమలానందకు బెయిల్ మంజూరు చేయరాదంటూ.. నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనితో కమలానందకు దాదాపుగా బెయిల్ దొరకనట్టే అని భావించవచ్చు. మరోవైపు భాజపా తో సహా పలు హిందు ధార్మిక సంస్థలు స్వామి కమలానంద అరెస్ట్ కు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు.