పాక్‌ హద్దు మీరి ప్రవర్తిస్తోంది : లెఫ్టినెంట్ జనరల్

parnayikభారత్‌ సరిహద్దులో పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల విషయంలో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు, విమర్శల వెల్లువలు కొనసాగుతున్నాయి. తాజాగా నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పర్నాయక్ పాకిస్తాన్ వాస్తవం అంగీకరించకుండా.. ఎప్పుడూ కట్టుకథలు అల్లుతుందని ఆరోపించారు. ప్లాగ్ మీటింగ్ తర్వాత కూడా పాక్ మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణను గౌరవిస్తామని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తిప్పికొడుతామని పాక్‌కు చెప్పామని ఆయన తెలిపారు. ప్లాగ్ మీటింగ్ తర్వాత మూడు సార్లు పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని మండిపడ్డారు. భారత సైన్యం తొందరపాటుగా, ఆగ్రహంతో స్పందించదని, తమకు ఓ ప్రణాళిక ఉంటుందని తెలిపారు.