పెరిగిన పెట్రోల్ ధరలు

petrol rates hikeమరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. కేంద్రప్రభుత్వం ఈసారి స్వల్పంగా పెట్రోల్ ధరలు పెంచింది. లీటరుపై 35 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే సవరించిన ధరలు అమలులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 67.56కు చేరుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఈ ఇంధనంపై విధించే అమ్మకం పన్ను, విలువ ఆధారిత పన్ను ప్రకారంగా ధర పెంపు ఉండనుంది. పెంపునకు ముందు రాష్ట్రంలో రూ. 73.73గా ఉన్న లీటరు పెట్రోల్ ధర మరో 45 పైసలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటంతో దేశీయంగా పెట్రోల్ రేట్లను కూడా పెంచాల్సి వచ్చిందని ఇంధన విక్రయ సంస్థలు అంటున్నాయి. నవంబర్ 2012 తర్వాత పెట్రోల్ ధరలను సవరించడం ఇదే తొలిసారి.