నిర్భయ కేసు : పవన్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ దోషులకి ఈ నెల 3 ఉదయం 6గంటలకి ఉరిశిక్షని అమలు చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండటం కారణంగా ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. తాజాగా ప‌వ‌న్ గుప్తా క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తిర‌స్క‌రించారు.

ఈ నేపథ్యంలో నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు కోసం ఢిల్లీ పాటియాల కోర్టు కొత్త డేటుని ప్రకటించనుంది. అయితే, ఇప్పటికే నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడింది. దీనిపై నిర్భయ తల్లి శాంతాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తో వస్తోంది. అయితే మరోసారి నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలువాయిదా పడే అవకాశాలు కనిపించడం లేదు. దోషులు వినియోగించుకోవాల్సిన న్యాయపరమైన అవకాశాలన్ని పూర్తయ్యాయ్. ఇక ఉరితీయడమే మిగిలింది. అదెప్పుడు ? అన్నది తెలియాల్సి ఉంది.