నృసింహుని మహాశక్తే పురాణపండకుఅనుగ్రహమైంది.

మేడపాటికి వరమైందన్నసింహాచలం ఈ.ఓ సూర్యకళ.

Puranapanda Srinivas, EO Suryakala, Medapati Ravindra

విశాఖపట్నం : జూలై ; 17

వైదిక సంస్కృతికి పట్టుగొమ్మలైన అపురూప గ్రంధాలు రచించి , ప్రచురించడంలో పురాణపండ శ్రీనివాస్ ప్రతిభ, మేధ, యజ్ఞభావన వెనుక లక్ష్మీనరసింహ భగవానుని అనుగ్రహ వాత్సల్యం ఉందని , మానవ జీవన మానసిక వ్యవస్థని బలపరిచి ఆత్మశక్తినిచ్చే నారసింహుని మంత్రమయ మహాశక్తుల్ని అపూర్వంగా అందించిన ” యుగే …. యుగే ‘ మహోత్తమ గ్రంధాన్ని ఆవిష్కరించడం తనకు నృసింహ కటాక్షంగా భావిస్తున్నామని సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎం.వి. సూర్యకళ పేర్కొన్నారు.

Puranapanda Srinivas, EO Suryakala, Medapati Ravindra

దక్షిణాయన ప్రవేశ పుణ్యదిన సందర్భంగా ప్రముఖ రచయిత , జ్ఞానమహాయజ్ఞకేంద్రం గౌరవ ప్రధాన కార్యదర్శి పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం ‘ యుగే … యుగే ” మహోన్నత గ్రంధాన్నిఆదివారం ఉదయం నృసింహ సన్నిధిలో ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి సూర్యకళ మాట్లాడుతూ పురాణపండ శ్రీనివాస్ ఒక్కొక్క మహాగ్రంధం ఒక్కొక్క మంత్ర దీక్షకు తలుపులు తీరుస్తుందని పేర్కొంటూ, ప్రాచీన కాలంలో శాస్త్ర మర్యాదల్ని బోధించి , సనాతన విద్యలతో జ్ఞాన శరీరాన్ని ప్రసాదించే వారని ఈ ‘ యుగే యుగే ‘ గ్రంధాన్ని ప్రచురించే భాగ్యానికి నోచుకున్న విశాఖ నగర భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ ని అభినందించారు .

గ్రంథ సమర్పకులు, భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటరీ నాయకులు మేడపాటి రవీందర్ మాట్లాడుతూ శ్రావణమాసంలో సింహాచల నారసింహునికి మరొక మంత్రమయ గ్రంధం పదివేల ప్రతులు సమర్పిస్తానని, తన తల్లితండ్రుల ఆశీర్వచనం వల్లనే తాను ఈ పుణ్య గ్రంధాన్ని సమర్పించగలిగానని , ఈ అంశంలో పురాణపండ శ్రీనివాస్ ప్రోత్సాహ చైతన్యం మరువలేనని కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు డాక్టర్ టి. రాజగోపాల్ , ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఆనందకుమార్ , పర్యవేక్షకులు ఎస్. మహేష్ , దేవస్థానం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అప్పల నాయుడు, పలువురు ఆరెస్సెస్ ప్రముఖులు , భారతీయ జనతాపార్టీ నాయకులు పాల్గొన్నారు.

Puranapanda Srinivas, EO Suryakala, Medapati Ravindra

Puranapanda Srinivas, EO Suryakala, Medapati Ravindra