ఫైనల్ లో ఫెయిల్ !

saniaఆస్ట్రేలియా మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్స్ లో సానియా మీర్జా జోడి పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సానియా మీర్జా-హొరియా టెకావ్ (రుమేనియా) జోడి పరాజయం పాలయింది. క్రిస్టియానా మ్లాడినోవిక్(ఫ్రెంచ్)-డానియన్ నెస్టర్(కెనడా) జోడి చేతిలో 3-6 2-6తో ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ రెండో టైటిల్ నెగ్గాలన్న ఆమె కోరిక తీరలేదు.