సర్వత్రా.. ’సత్య నాదెళ్ల’

satyanadellatopతెలుగోడి ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేశాడు సత్య నాదెళ్ల. భాగ్యనగరం ముద్దుబిడ్డ సత్య నాదెళ్ల ప్రపంచంలో కెల్ల మేటి ఐటి సంస్థ ‘మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్’ సిఇఓ గా ఇటీవలే నియమితులైన విషయం తెలిసిందే. స్టీవ్‌ బాల్మేర్ స్థానంలో సత్య సీఇఓ గా బాధ్యతలు స్వీకరించారు. ’మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్’ సత్య మూడవ సీఇఓ. గత 38 ఏళ్లలో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత సంస్థ సిఇఓగా సత్య నాదెళ్ల నియమితులయ్యారు. ఇంత ఎత్తుకు ఎదగడానికి సత్య పట్టుదల, కృషి అమోగం అంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా వున్న ఐటీ నిపుణులు.

09_low‘మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్’ సీఇఓగా సత్య నాదెండ్ల న్యూస్ వచ్చినప్పటి నుంచి ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సత్య ఫేస్ బుక్ ఫాలోవర్స్, గూగుల్ సెర్చ విజిటర్స్ విపరీతంగా పెరిగిపోయారు. సీఇఓ గా ప్రకటించిన సమయంలో.. గూగుల్ రిజల్డ్స్ 2కోట్లు వుండగా, ప్రస్తుతం 434,000,000 (0.22సెకన్స్) గా వుంది. ఎక్కడ నలుగురు చేరి మాట కలిపినా.. వచ్చేది సత్యనాదెండ్ల టాపిక్ నే. సర్వత్రా.. సత్య నాదెండ్ల అనే విధంగా ఆయన గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక హైదరాబాద్ ఐటీ ప్రొఫెషనల్స్ అయితే సరేసరి. ఇంతకీ సత్య సంవత్సరానికి అందుకోనున్న జీతం ఎంతో తెలుసా అక్షరాల 112కోట్లు. సంస్థకు సీఇఓ కాకముందు ఆయన జీతం యుఎస్ డి 1.2 మిలియన్స్, సీఇఓ అయిన తరవాత సత్య సాలరీ.. యుఎస్ డి 18  మిలియన్స్. వావ్.. కదా..!!

05_low హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ లో విద్యనభ్యసించిన సత్య నాదెళ్ల మంగళూర్ విశ్వ విద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. విస్కోసిన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో పిజి, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చికాగో విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. భాగ్యనగరం ముద్దుబిడ్డ సత్య కెరియర్ మొదలైంది భేగంపేటలోనే. కృషి పట్టుదలతో.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం కలిగిన మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్’ సీఇఓ గా ఎదిగిన సత్య నాదెండ్ల ను నిజంగా అభినందించాల్సిందే. సీఇఓ గా సంస్థకు మంచి పేరు, లాభాలతో తెలుగుగోడి గొప్పదన్నాని మరింత పెంచాలని ఆశిద్ధాం.