20న త్యాగరాజ ఆరాధనోత్సవం

Tyagaraja Aradhanotsavamజంటనగరాల్లోని సంగీత ప్రియులకు, మరీ ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని అభిమానించే శ్రోతలకు ఓ శుభవార్త. ఈ ఆదివారం ఉదయం 10 గంటలకు దిల్ సుఖ్ నగర్ లోని శ్రీ సీతారామ సంగీత కళావేదికలో శ్రీ త్యాగరాజ ఆరాధానోత్సవం… పంచరత్న గానం శీర్షికన తమ గాత్రాలతో శ్రోతలను అలరించబోతున్నారు టికే సిస్టర్స్ (సరోజ, సుజాత). ప్రతి సంవత్సరం పుష్యబహుళ పంచమి సందర్భంగా త్యాగరాజు జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు దేశవ్యాప్తంగా జరగడం పరిపాటే. దీనిలో భాగంగా మన హైదరాబాద్ లో ఈ ఆదివారం జరగబోతున్న ఈ సంగీత వేడుకలో పలువురు ప్రముఖ శాస్త్రీయ సంగీత విధ్వాంసులు, వాధ్య కళాకారులు పాల్గొననున్నారు. సంగీత ప్రియులందరూ.. ఈ వేడుకలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలియజేశారు.