ఆ ఫిక్సర్ ఎవరు.. ??

cricket-fixerసుప్రీంకోర్టుకు ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. ఐపీఎల్‌ లో స్పాట్ ఫిక్సింగ్‌ పై విచారణ జరిపిన ముద్గుల్ కమిటీ తన నివేదికను సోమవారం సుప్రీంకోర్టు ముందుంచింది. ఫిక్సింగ్ కుంభకోణంలో 6గురు భారత ఆటగాళ్లకు సంబంధం వున్నట్లు కమిటీ తేల్చింది. అందులోనూ.. ఒకరు ప్రస్తుత భారత జట్టులో వున్నారని కూడా పేర్కొంది. అతడు ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులోనూ సభ్యుడని పేర్కొని మరింత షాక్ నిచ్చింది.

అయితే, ప్రప్రంచకప్ ఆడి.. ప్రస్తుతం భారత జట్టులో వున్నావారిలో ధోని, కోహ్లీ, అశ్విన్, రైనా, అశ్విన్ లు మాత్రమే వున్నారు. మరీ.. వీరిలో ఎవరు ఫిక్సింగ్ కు పాల్పడ్డారు.. ?? అనేది మాత్రం ముద్గల్ కమిటీ బహిర్గతం చేయలేదు. కాగా, ఐపీఎల్‌ లో స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ జరిపేందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలో.. అదనపు సొలిసిటర్ జనరల్ నాగేశ్వరరావు, అసోం క్రికెట్ సంఘం సభ్యుడు నిలయ్ దత్తాలను సభ్యులుగా సుప్రీంకోర్టు కమిటీని నియమించిన విషయం తెలిసిందే.