12 ఏళ్ల తర్వాత అజారుద్ధీన్‌కు ఊరట

భారత్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, ప్రస్థుత కాంగ్రెస్‌ ఎంపీ అజారుద్ధీన్‌కు 12 ఏళ్ల తర్వాత ఊరట లభించింది. హైదరాబాద్ హైకోర్టు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వివాదంలో అజారుద్ధీన్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినందుకు బీసీసీఐ జీవితకాల నిషేధం విధించడంపై అజారుద్ధీన్ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు అజారుద్దీన్‌పై జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశించింది. దీనితో పాటుగా హైకోర్టు బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అలాగే బీసీసీఐ నిర్ణయాన్ని గతంలో కింది కోర్టు సమర్థించడాన్ని కూడా  హైకోర్టు తప్పుబట్టింది. ఫలితంగా 2000 బీసీసీఐ విధంచిన జీవితకాల నిషేధం నుంచి అజారుద్ధీన్ విముక్తి కలిగింది. అంటే అజారుద్దీన్‌ మరో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాలన్న తన జీవితకాలపు కోరికను తీర్చుకోవడానికి అవకాశం దొరికినట్టే నన్నమాట.