గ్వాటెమాలా భూకంపంలో 40మంది మృతి

Guatemala earthquakeఈరోజు ఉదయం గ్వాటెమాలా, వాంకోవర్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 48 మంది మృతిచెందారు. రిక్టర్‌ స్కేలుపై 7.5గా భూకంప తీవ్రత  నమోదైనట్టు సమాచారం. మెక్సికోకు సరిహద్దుల్లో రెండు ప్రావిన్స్‌ లలో రహదారులపై మట్టిపెళ్లలు, కొండ చరియలు విరిగిపడ్డాయి.   ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం శాన్‌మార్కోస్‌ ప్రావిన్స్‌లో 40 మంది, సరిహద్దుల్లోని ప్రావిన్స్‌లో 8 మంది మృతిచెందినట్లు సమాచారం. ఓ ఇసుక క్వారీలో ఏడుగురు సజీవంగా సమాధి అయ్యారు. వీరిలో ఆరేళ్ల బాలుడు కూడా చిక్కుకున్నాడు. శాన్‌ మార్కోస్‌లో 30 ఇళ్లు కూలిపోయాయి. భారీగా ఆస్తినష్టం నమోదైంది.