తెలుగు భాషాభిమానానికిదేనా చిహ్నం… ?

  • వైభవోపేతమైన మన తెలుగు జాతి భాష, సంస్కృతులపై నేటి బాలలకు, యువతరానికి ఆసక్తిని కల్పించి భావితరానికి సమగ్రంగా అందించేలా కృషిచేయడం…
  • ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో భావసమైక్యాన్ని కలిగించడం….
  • తెలుగు భాషను ప్రముఖ ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో (ఇంటర్ నెట్) ఉపయోగించేలా చర్యలు చేపట్టడం..
వగైరా..వగైరా..వగైరా..లక్ష్యాలను నిర్థేశించుకొని మన ప్రభుత్వం డిసెంబర్ 27, 28, 29వ తేదీలలో తిరుపతి నగరంలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి తలపెట్టిన విషయం తెలిసిందే. ఇంతవరకూ బాగానేవుంది. అయితే పైన మీరు చూస్తున్న సదరు మహాసభల సన్నాహాక సమావేశానికి సంబంధించిన ఆహ్వానపత్రికలో మచ్చుకు ఒక్కటైనా తెలుగుపదం అంటూ లేకుండా ముద్రించడమే విడ్డూరంగా ఉంది. ఈ ఆహ్వానపత్రికను గమనిస్తే నిర్వాహకులకు తెలుగు భాషపై ఎంతటి మమకారం ఉందో ఇట్టే అర్థమైపోతుంది. కొసమెరుపుగా బహుశా సదరు నిర్వాహకులు “దేశ భాషలందు తెలుగు లెస్స” ను “తెలుగు లెస్సు” గా భావించి భ్రమించినట్టున్నారు.