టాటా గ్రూప్ ఆరవ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ

cyrus_mistryసైరన్ మిస్త్రీ టాటా గ్రూపు నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలను సోమవారం స్వీకరించనున్నారు. గ్రూపు ప్రధాన కార్యాలయమైన బాంబే హౌస్ వర్గాలు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మిస్త్రీ ఇవాళ కార్యాలయానికి వస్తారని తెలిపాయి. రతన్ టాటా శుక్రవారం టాటా గ్రూపు చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. టాటా గ్రూపునకు ఆరో చైర్మన్‌గా రతన్ టాటా పదవీవిరమణ తర్వాత మిస్త్రీని నియమించిన విషయం తెలిసిందే. సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ ఆరవ చైర్మన్ గా పగ్గాలు చేపట్టనున్నారు.