అమ్మా క్షమించు !

అమ్మ కడుపు శోకానికి
అత్యున్నత తీర్పు !
ఆడబిడ్డ శీలానికి
తాత్కాలిక ఓదార్పు !!

మరువలేదు ప్రియభారతి
అర్దరాత్రి గుండెకోత !
ఉపశమనం కలిగేనా
కీచకులకు ఉరితీత !!

అతివల రక్షణకిక్కడ
లేదట హామీ పత్రం !
కొవ్వెక్కిన రక్కసులకు
ఇదో ధర్మసత్రం !!

చట్టమేమి చేయగలదు
భయమన్నది లేనప్పుడు !
దిగజారుడు సహజమంట
మనిషి జన్మ కానప్పుడు !!

– ఏవీయస్