బ్లాక్ అండ్ వైట్ సినిమా

విభజన సెగ తాకిందట
తెలుగు చలన చిత్రాలకు !
విడుదల ఇక కష్టమంట
వినోదాల పత్రాలకు !!

కత్తిమీద సామయింది
రాజకీయ సినిమా !
తేడా వస్తే తప్పదు
హీరోలకు సరిగమా !!

తండ్రి నోరు జారాడో
కొడుకు బొమ్మ టెన్షనూ !
ఇక ముందర వుండదోయి
నూర్రోజుల ఫంక్షనూ !!

మారినాయి పాలిటిక్సు
జాగ్రత్తోయ్ యాక్టర్లూ !
ఒక్కసారి దెబ్బతింటె
దొరకరింక డాక్టర్లూ !!

– ఏవీయస్