చైల్డ్ ఆర్టిస్టు

అక్కినేని కుర్రాడికి
వయస్సు తొంభయ్యేళ్ళు !
పరవశించి పోయాయట
తెలుగు సినిమ లోగిళ్ళు !!

అభినయాల గురుకులాన
అతడు పెద్దబాలశిక్ష !
వెండితెరకు ఆప్తబందు
నటనకు శ్రీరామరక్ష !!

దేవదాసు కాళిదాసు
ఆంగిక రామాయణం !
అమరశిల్పి జక్కన్నకు
నటనే పారాయణం !!

అణువణువూ ప్రతి అడుగూ
ఆసాంతం అపురూపం
భారతీయ చలనచిత్ర
జాతికతడు మణిదీపం !

– ఏవీయస్