ధిక్కారప్పొడి !

సమైక్యాంధ్ర గళం తోటి
తిరగబడిన నల్లారి !
ఉద్యోగం పోయిందో
మాజీ యట తెల్లారి !!

మంచిగాని చెడుగానీ
మాట్లాడిన ముఖ్యమంత్రి !
హస్తిన పెద్దల భజనకు
కాలేదట భజంత్రి !!

పదవితూచ్ పొమ్మంటూ
సోనియా ను తిట్టాడు !
పార్టి నొదలబోనంటూ
మరో మడత పెట్టాడు !!

డిల్లీ పెద్దల కళ్ళకు
ప్రసరిస్తుందా ‘ కిరణం ‘ !
ఎలెక్షన్ల సమయంలో
రాజకీయమే స్మరణం !!

– ఏవీయస్