జాతకరత్న సోనియా

ఇటలి తల్లి చేతుల్లో
తెలుగుజాతి జాతకం !
రాజకీయ స్వార్ధంతో
సోనియమ్మ పాతకం !!

భారతీయ కోడలికిది
నాలుగుస్తంభాలాట !
బీట వారిపోతోందట
కాంగిరేసు కంచుకోట !!

రగులుతున్న తెలుగుజనం
రోడ్లపైన ప్రభంజనం !
రెండుచోట్ల సమన్యాయం
లేకుంటే వినాశనం !!

ఎందులకీ పాలిటిక్సు
స్టేటు తగలబడుతుంటే !
దిమ్మతిరిగి పోతుందోయ్
జనం తిరగబడుతుంటే !!

– ఏవీయస్