మోడి పలావు !

భారతీయ జనతాకిక
వెలుగురేఖ మోడీ !
రెండువేల పద్నాలుగు
కూస్తోందట కొడీ !!

అలిగినాడు అగ్రనేత
అద్వానీ మూతి ముడిచి !
ఎవడూ పట్టించుకోడు
సానుభూతి జాలి మరచి !!

ప్రధానిగా నరేంద్రుడికి
ఉంటుందా యోగం !
సజావుగా సాగేనా
ఆశ్వమేధ యాగం !!

ఉత్తరాన ఏమో మరి
సౌత్ సంగతే డౌటు !
జనం దగ్గరవకుంటే
పేలుతుంది ఔటు !!

– ఏవీయస్