ఉత్తినే...!

సర్కారీ వ్యభిచారం !

మందుకొట్లు పెరిగినాయి ఫుల్లుగ తాగండి గురూ ! తాగి చిందులేయండీ చిల్లులు జేబులకు షురూ !! మనిషిని దిగజార్చే మద్యం సర్కారుకు వ్యాపారం ! పాలక పెద్దల మెడలో నెత్తుటి పచ్చలహారం !! ఎవరదికారంలోకొచ్చిన ఇదే తీరు అనివార్యం...

బూచాళ్ళొస్తున్నారు !

పల్లెల్లో మొదలైందట కురుక్షేత్ర సమరం ! ఎగిరిందట ఊళ్ళ మీద ఎలెక్షన్ల భ్రమరం !! నాయకులకు జనంపైన తాజాగా మమకారం ! ప్రశాంతతను కోల్పోయే గ్రామ సీమ ప్రాకారం !! అబద్ధాల పళ్ళెంలో నెరవేరని ప్రామీసులు ! అసత్యాల తాకిడితో నిరంతరం ప్రాక్టిసులు !! జనమే మారాజులంటు అరచేతిలొ స్వర్గం ! బతుకులు...

తేల్చండి ప్రభూ !

మరోసారి వేడెక్కిన తెలంగాణ నినాదం ! సర్కారీ పెద్దలకిది కాకూడదు వినోదం !! ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే సుఖాంతం ! నాన్చివేత ధోరణితో సాగతీత దుఃఖాంతం !! స్టేటు వెనుకబడుతోందీ ఉద్యమాలు ఉధృతం ! డెసిషన్ లేటయ్యిందో పొజిషనింక వికృతం !! ఎందుకు లేటవుతుందో సోనియమ్మకే తెలుసు ! ఇది ఇలాగ...

గొంతులో కిచ కిచ … !

మంత్రి పదవి రాగానే మారినావు కావూరీ ! సమైక్యాంధ్ర గావుకేక మారిందట పొగచూరీ !! అంత తేలికా బ్రదరూ మాట మార్చు ముచ్చట ! నరంలేని నాలుకలట వినువాడికి పిచ్చట !! అలిగినావు ఆ నాడూ ఏమయింది సాంబశివా ! బలుపు కారు రాగానే గొంతులోన కువ కువా...

నవ్విపోదురుగాక !

ఇరవై రోజులు జరిగిన అసెంబ్లీకి శెలవు ! నిత్యం వాకౌట్లు షురూ నిరసనలకు నెలవు !! ఎంత వృధా ఎంత వృధా ఇది పబ్లిక్ డబ్బు ! సిగ్గు శరము లేని తీరు ఇది తరగని జబ్బు !! ప్రజలసమస్యలు పట్టని మీటింగులు శుద్ధ వేస్టు...

రెప్ప కాటు !

ఇంతటి బీభత్సమేల గంగా యమునా ! అమ్మలాంటి వాళ్ళు కదా మీకిది తగునా !! శివుని జటాజూటమొదిలి పరుగెందుకు గంగమ్మా ! బిడ్డలనే మింగేసే నిను చూస్తే బెంగమ్మా !! తుడిచిపెట్టి పోయాయట మహా పుణ్య క్షేత్రాలు ! మహానదిగ మారాయట ప్రియభారతి నేత్రాలు నినుచూసేందుకు వచ్చిన భక్తులకెందుకు శిక్ష ! పాపులెంతమంది...

గోల్డ్ హాలిడే !

బంగారం కొనొద్దంటు చిదంబరం సలహా ! గోల్డు హాలిడే ఇమ్మను విత్తమంత్రి తరహా !! రేటు తగ్గిపోయిందని బంగరు కొట్లకు వరద ! రూపాయ్ పడిపోయిందంటే ఖజానాకు బెడద !! పెళ్ళీ శోభనమూ కూడా పోస్టుపోను ఏడాదీ ! స్వర్ణం కొన్నప్పుడె మనకిక బంగారపు ఉగాదీ !! కట్నాల్లో నగలు...

ఛీ… పాడు బందులు !

సందులలో గొందులలో ఎందుకు ఇబ్బందులు ! ఎవ్వడు కనిపెట్టాడో గానీ ఈ దరిద్ర బందులు !! ఒక్కడు పిలుపిస్తుంటే రాష్ట్రం మూసెయ్యాలా ! బతకలేని సామాన్యుల గొంతులు కోసెయ్యాలా !! ఉద్యమాలు సబబే మరి ఇక్కట్లు ప్రజలకూ ! ఎపుడో ఇస్తారు జనం నాయకులకు ఝలకూ !! సామాన్యుడి పొట్టకొట్టు నిరసనలకు...

పాపం బాలాజీ !

తిరుపతిలో కొండపైన భక్తులకూ తిప్పలు ! మారని అధికారగణం నూతిలోన కప్పలు !! పెద్దవారి సేవలతో ట్రస్ట్ బోర్డ్ తరిస్తోంది ! సామాన్యుడి సంగతేంటి అడుగుతుంటె కరుస్తోంది !! ఎండనకా వాననకా అవస్థలో భక్తులూ ! కుయ్ అనరూ కయ్ అనరూ అధికారిక శక్తులూ !! కోట్లమంది ఇలవేలుపు శ్రీవేంకటనాథుడు ! అడుగడుగూ...

ఇక ఊచల్లెక్క !

జైలు బతుకు తప్పదంట ధర్మానా సబితలకు ! అడ్డుకట్ట పడినట్టా రాజకీయ భవితలకు !! అభయ 'కిరణ'మున్నా మరి అనివార్యం ఇక్కట్లు ! వచ్చే ఎన్నికలలోన దొరికేనా టిక్కెట్లు !! సంతకాల పాపానికి సవాలక్ష అగచాట్లు ! ఎవరి పాపమెంతుందో జరిగినాయి పొరపాట్లు !! పోయి బతికిపోయాడట సూత్రధారి రాజన్నా ! వళ్లు...

Latest News