రూపాయికి జ్వరం !

చిక్కి శల్యమౌతోందట
మనదేశపు రూపాయి !
విలువలేని కరెన్సీకి
విత్తమంత్రి సిపాయి !!

మనను వెక్కిరిస్తోందట
ఎగతాళిగ డాలరు !
ఏమి గొప్పతనముందని
ఎగరేస్తాం కాలరు !!

చిదంబరం బాబాయికి
డబ్బు మీద పట్టులేదు !
ఇప్పట్లో ఇండియాకు
ఎక్కేందుకు మెట్టులేదు !!

అసమర్ధపు లీడర్లకు
వినదు మాట మనరూపీ !
అమెరికాను చూసైనా
కొట్టండయ్య కాపీ !!

– ఏవీయస్